![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam 2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -554 లో... దీపతో దశరథ్ మాట్లాడుతుంటాడు. వచ్చే జన్మలో అయిన నా కూతురిగా పుట్టాలని దీపతో దశరథ్ అనగానే ఈ జన్మలోనే నేను నీ కూతురిని నాన్న అని దీప మనసులో అనుకుంటుంది. సుమిత్ర అమ్మకి ఏం కాదని దీప ధైర్యం చెప్తుంటే.. అప్పుడే సుమిత్ర ఎంట్రీ ఇచ్చి నాకేమవుతుందని అడుగుతుంది. దాంతో దశరథ్ కవర్ చేస్తాడు. ఆవును మీ ఆయన ఎక్కడ అని దీపని సుమిత్ర అడుగుతుంది.
మరొక వైపు జ్యోత్స్న అన్న మాటలు గుర్తుచేసుకుంటాడు వైరా. అందుకే ఆ జ్యోత్స్నని నమ్మొద్దని చెప్పానని తన పీఏ అంటాడు. మరి ఆ పీఏ సంగతి ఏంటని అతను అనగానే.. వాడు ఎక్కడికి పోతాడు వస్తాడని వైరా అంటాడు.
అప్పుడే కార్తీక్, కాశీ వస్తారు. నువ్వు ఎందుకు వచ్చావని వైరా అడుగుతాడు. ఇక్కడ జాబ్ మేళా జరుగుతుంది అంట కదా అందుకే వచ్చానని కార్తీక్ అంటాడు. నువ్వు నాతో చేతులు కలుపు.. నిన్ను నా సంస్థకి హెడ్ ని చేస్తానని వైరా అంటాడు. మీరు చేసినవన్నీ సాక్ష్యంతో సహా నా దగ్గరున్నాయని వైరాని కార్తీక్ తన వెంట లాక్కొని వెళ్తాడు.
మరొకవైపు ఇంటి ముందు మీడియా వాళ్ళున్నారని శివన్నారాయణకి దీప వచ్చి చెప్తుంది. మిమ్మల్ని ఎవరు రమ్మన్నారని మీడియా వాళ్ళని శివన్నారాయణ అడుగుతాడు. నేనే రమ్మన్నానని వైరా, కాశీలని తీసుకొని వస్తాడు కార్తీక్. మీడియా వాళ్ళందరికి చెప్తూ.. సీఈఓ శ్రీధర్ ఏ తప్పు చెయ్యలేదు అంత చేసింది ఈ వైరా.. అందుకు సాక్ష్యం ఈ కాశీ అని కార్తీక్ చెప్తాడు. కాశీ జరిగిందేదో చెప్పమని కార్తీక్ అనగానే కాశీ జరిగింది మొత్తం చెప్తాడు.
నేను చేసాను కానీ నాతో చేయించింది జ్యోత్స్న అని వైరా చెప్పినట్లు జ్యోత్స్నని పోలీసులు అరెస్ట్ చేసినట్లు పారిజాతం ఉహించుకుంటుంది. వైరా, జ్యోత్స్న వాళ్లే ఇదంతా చేసానని కార్తీక్ చెప్తాడు కానీ ఎవరు నమ్మరు. నేను ఏం చెయ్యలేదు వైరా.. నాకు కాల్ చేసాడని జ్యోత్స్న రికార్డు చేసిన ఆడియో వినిపిస్తుంది. అందులో వైరాతో జ్యోత్స్న కోపంగా మాట్లాడింది ఉంటుంది. నా మనవరాలు ఏ తప్పు చెయ్యదని శివన్నారాయణ అంటాడు. కాశీ కూడా జ్యోత్స్నకి ఎలాంటి సంబంధం లేదని చెప్తాడు. కాశీ, వైరాలని పోలీసులు అరెస్ట్ చేస్తారు.
జ్యోత్స్న స్టేషన్ కి వెళ్లి సీఈఓ గారిని తీసుకొని రావాలని కార్తీక్ అనగానే వెళ్ళమని శివన్నారాయణ అంటాడు. జ్యోత్స్న భయంగానే కార్తీక్ తో వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |